Monday, December 23, 2024

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పళని ఏకగ్రీవ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా పళని ఏకగ్రీవ ఎన్నిక
పన్నీర్ సెల్వం పిటిషన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేత
చెన్నై: అన్నా డిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సిఎం ఒ. పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన కొద్ది సేపటికే పళని ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పుడు పార్టీ పగ్గాలను పళనిస్వామి పూర్తి స్థాయిలో చేపట్టారు. అన్నా డిఎంకెలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేసి, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే ప్రధాన కార్యదర్శి పదవికి గత ఏడాది మార్చి 26 న ఎన్నికలు నిర్వహించారు. ఆ పదవికి పళని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మేరకు పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అధినాయకత్వ పోరులో కోర్టుకెళ్లిన పన్నీర్ సెల్వం (ఒపిఎస్)పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయగా, కొద్దిసేపటికే ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మరణించిన తరువాత పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం సమన్వయ కర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయ కర్తగా కొనసాగారు. అయితే ఈ ద్వంద్వ నాయకత్వంలో నిర్ణయాలు తీసుకోవడం సమస్యలను తెచ్చిపెట్టింది.

దీంతోపార్టీ సర్వసభ్య సమావేశం 2022 జూన్ 23న నిర్వహించగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరోసారి జులై 11న సమావేశం జరిగింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి ఆమోదం లభించింది. కొత్తగా ఉప ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకు వచ్చారు. అన్నా డిఎంకె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనిపై పన్నీర్ సెల్వం మొదట మద్రాస్ హైకోర్టును, తరువాత సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోయింది. పళని ఎన్నికనే న్యాయస్థానాలు సమర్ధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News