Thursday, January 23, 2025

ఘోర రైలు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్టణం నుంచి రాయ్‌గఢ్‌కు వెళ్లే ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లాలో ఆగి ఉన్నప్పుడు పలాస్ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రిపూట కావడంతో వెంటనే సహాయక బృందాలు ఇక్కడికి చేరుకున్నా వెంటనే బోగీలలో చిక్కుపడ్డ పలువురు ప్రయాణికులను వెలికితీయలేకపొయ్యారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ప్యాసింజర్ రైలు నిలిచి ఉంది. ఇదే దశలో వేగంగా వచ్చిన పలాస్ ఎక్స్‌ప్రెస్ ఈ రైలును ఢీకొట్టింది. దీనితో ప్యాసింజర్ రైలుకు చెందిన మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రాంతం అంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. ఈ ప్రమాదంతో విద్యుత్ తీగలు తెగిపడటంతో ఇక్కడ కరెంట్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో ఈ దారిలో ప్యాసింజర్ రైలు నిలిచిపోయిందని, వెనుక నుంచి వచ్చిన పలాస ఎక్స్‌ప్రెస్ దీనిని ఢీకొందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News