Sunday, December 22, 2024

పాలస్తీనాకు మద్దతుగా నాంపల్లిలో పోస్టర్లు

- Advertisement -
- Advertisement -

నాంపల్లిలో ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేకెత్తించింది. పాలస్తీనాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ను బాయ్ కాట్ చేయాల్సిందిగా ఈ పోస్టర్లపై రాసి ఉంది. పోస్టర్లు రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హైదరాబాద్ లో ఇలా పోస్టర్లు వెలియడం కొత్తేమీ కాదు. గతంలో కోటిలోని గుజరాతీ గల్లీలో కొన్ని దుకాణాలపై ఇజ్రాయెల్ ను, అమెరికాను బాయ్ కాట్ చేయాల్సిందిగా పిలుపునిస్తూ పోస్టర్లు అంటించారు.

ఇలా పోస్టర్లను ముద్రించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. వీటిని వెంటనే తొలగించకపోతే, ‘ఇజ్రాయెల్ కు మద్దతు తెలపండి’ అని పిలుపునిస్తూ పోస్టర్లు అంటిస్తామని హెచ్చరించారు. పాలస్తీనాకు మద్దతుగా ఇలా అంటించిన పోస్టర్లను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News