Sunday, January 19, 2025

పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే రాజీనామా

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్ హమాస్ నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మొహహ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్టు సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. గాజాతోపాటు వెస్ట్‌బ్యాంక్, జెరూసలెం ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తోన్న పోరు ముగిసిన తర్వాత, ఇక్కడ రాజకీయ ఏర్పాట్ల గురించి పాలస్తీనియన్లలో ఒక ఏకాభిప్రాయం ఏర్పడడానికి వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే రాజీనామా
ఆమోదంపై అధ్యక్షుడి నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు.

పాలస్తీనా ఇన్వెస్టిమెంట్ ఫండ్ ఛైర్మన్‌గా ఉన్న మొహమ్మద్ ముస్తఫాను నూతన ప్రధానిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. యుద్ధం ముగిసిన తరువాత గాజా ప్రాంతాన్ని పాలించే రాజకీయ వ్యవస్థ నిర్మాణంపై ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాలస్తీనా అథారిటీని పునర్ వ్యవస్థీకరించాలని అమెరికా భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పాలస్తీనా అధ్యక్షుడిపై అగ్రరాజ్యం నుంచి తీవ్ర ఒత్తిడి ఉందనే వాదన ఉంది. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలంటే అనేక అడ్డంకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యం లోనే ప్రధాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News