Monday, December 23, 2024

పాలస్తీనా ప్రధానిగా ముస్తఫా

- Advertisement -
- Advertisement -

రమల్లా : పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు. అధ్యక్షుడు మమమూద్ అబ్బాస్ తన వద్ద సుదీర్ఘకాలంగా సలహాదారుగా ఉన్న ముస్తఫాను ప్రధానిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాన్ని చేపట్టారు. ఆర్థిక వేత్త అయిన ముస్తఫా అమెరికా లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో చదువుకున్నారు.

పాలస్తీనా విమోచన సంస్థ (పీఎవవో)లో సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. ఇజ్రాయెల్ పై దాడి తరువాత ప్రధానిగా ఉన్న మొహమ్మద్ గత నెలలో తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా ఒత్తిడి తోనే ముస్తఫా నియామకం జరిగినట్టు తెలుస్తోంది. కొత్త ప్రధాని అధికారాలు , ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితం గానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ముస్తఫాకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News