Monday, December 23, 2024

ఇజ్రాయెల్ జెరుసలెంలో ఉగ్రదాడి..

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్: ఉగ్రదాడిలో ఎడుగురు మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్ లోని జెరుసలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. యూద్ ప్రర్థనా మందిరం సినగోగ్ కు ఉగ్రవాది రాత్రి 8:13 గంటలకు కారులో వచ్చాడు. తూర్పు జెరూసలేం పరిసరాల్లోని ప్రార్థనా మందిరం వద్ద మరియు ప్రార్థనా మందిరం వెలుపల ఉన్న వ్యక్తులు మరియు ఇతర బాటసారులపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో స్థానికులు ఏడుగురు మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం ఉగ్రవాది పారిపోతుండగా పోలీసులు వెంబడించగా పోలీసులపై ఎదురుకాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఉగ్రవాది సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News