Thursday, January 23, 2025

మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మాలే: నేడు మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార గెలుపు పై అంతటా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ మయిజ్జు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో 6 పార్టీలు పోటీ పడుతున్నాయి. కాగా 93 సీట్లకుగాను 368 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు అధ్యక్షుడు మయిజ్జు పాలనపై ప్రజా తీర్పుగా భావిస్తున్నారు. మయిజ్జు ఇటీవల భారత్ కు వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా తన ఓటు హక్కును మయిజ్జు వినియోగించుకున్నారు. కాగా మాల్దీవుల్లోని 285000 మంది ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News