Sunday, December 22, 2024

ఎంఎల్‌సి పదవులకు పల్లా, కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఆమోదించిన చైర్మన్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు శనివారం ఎంఎల్‌సి పదవులకు పలువురు రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేయగా, వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు.

ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్‌రెడ్డిలు ఎంఎల్‌ఎలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం 15 రోజుల లోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎంఎల్‌సి పదవులకు రాజీనామా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News