Sunday, December 22, 2024

కండ్ల ముంగట పదేండ్ల ప్రగతి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫూలు, కరెంటు కోత లు ఉండేవని, అదే బిఆర్‌ఎస్ పాలనలో ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో నంబర్ వన్ అని, రైతుబంధులో నంబర్ వన్, రైతుబీమాలో నంబర్ వన్, ప్రతి ఇం టికి మంచినీళ్లు అందించడంలో నంబర్ వన్ అని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. జనగామ జిల్లాపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రేమ ఎక్కువ అని, అందుకే జనగామ జిల్లా అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తున్నారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న జరిగే సిఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యం లో బుధవారం జనగామలో నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్‌రావు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథో డ్, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య,

స్థానిక ఎంఎల్‌ఎ, ఆర్ టిసి చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎం ఎల్‌ఎ, రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజయ్యతో కలిసి హా జరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎం ఎల్‌సిగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా అనేక బాధ్యతలు నిర్వర్తించి ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న పల్లా రా జేశ్వర్‌రెడ్డికి జనగామ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం సంతోషదాయకమన్నారు. సూర్యాపేట జిల్లాకు చెంది న వేణుగోపాల్‌రెడ్డి అనే విద్యార్థి 2010లో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్, బిజెపిల ఎంఎల్‌ఎలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చే సుకొని అమరుడయ్యారన్నారు. ఆ విద్యార్థి మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీస్ లాఠీచార్జీల మధ్య పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలిసారిగా పరిచయమయ్యారని అన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం ఆశీర్వదించారని, అది బిఆర్‌ఎస్ సంస్కృతి అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గ్రూపులు, కుర్చీల కోసం కొట్లాటలు, మత కలహాలు సృష్టిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని పనులను పదేళ్లు నిండకముందే కెసిఆర్ చేసి చూపించాడని, కాంగ్రెస్ పాలనపై, బిఆర్‌ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటున్నాడు ఒక కాంగ్రెస్ నాయకుడన్నారు. కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన, చెప్పని హామీలను నెరవేర్చిన నాయకుడని, ఎన్నికల హామీలో లేని రైతుబంధు చేసిండని, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీళ్లు ఇవ్వడం చాలా ఒకటి కాదు అనేక కార్యక్రమాలు చేసి చూపించారన్నారు. కర్ణాటకలో అమలు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చేతులెత్తేసిందన్నారు. జనగామలో గెలుపు విషయంలో అనుమానం లేదని, మెజారిటీ ఎంత అనేది ముఖ్యమని, సిద్దిపేటలో నాతో పక్కన దయాకర్‌రావుతో పోటీపడాల్సిందేనని, అన్నివర్గాలను కలుపుకొనిపోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నాయకులు ఇద్దరు కలిసిపోయారు కాబట్టి కార్యకర్తలు కూడా మనస్పర్థలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవించారని గుర్తుచేశారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలాగే జనగామను కంటికి రెప్పలా కాపాడుకునే మరో నాయకుడు దొరికాడన్నారు. జనగామలోకి ప్రవేశించడంతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి సైతం బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా టీఎస్ ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలి పిస్తానని మంత్రులకు హామీ ఇస్తున్నానని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సిఎం కెసిఆర్‌కు అతి సన్నిహితుడని, జనగామ అభివృద్ధికి కృషిచేస్తారని అన్నారు. ఈ 14 సంవత్సరాల్లో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ముత్తిరెడ్డి మంచి మనసుతో ఆశీర్వదించారని, వారి సలహాలు, సూచనలతో జనగామను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతానని అన్నారు. చేర్యాలను సీఎం కెసిఆర్ డివిజన్‌గా చేస్తారని అన్నారు.

16న లక్ష మందితో కెసిఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ హరీషన్న ప్రోత్సాహంతో పల్లా రాజేశ్వర్‌ను గెలిపిస్తామన్నారు. దేవాదులను పూర్తి చేసిన ఘనత మాదన్నారు. జనగామను అభివృద్ధి చేయాలనే హరీశ్‌న్న నాయకత్వంలో తాను టీఆర్‌ఎస్‌కు వచ్చానని, సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో జనగామ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. కాంగ్రెస్ ఢోకా మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఎలాంటి పథకాలను అమలుచేయలేదన్నారు. 16న సీఎం సభను సిరిసిల్ల సభకు కంటే భారీ విజయవంతం చేస్తామన్నారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం అతి సన్నిహితుడైన పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సిఎం కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పండుగలు వస్తే గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు వస్తున్నారని, ప్రజలు వారిని ప్రశ్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్‌పి చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోకల జమున, మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, కౌన్సిలర్లు, జడ్‌పిటిసిలు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News