Sunday, December 22, 2024

ఆ రాష్ట్రాల్లో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారా?: పల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే రైతుల గతి అథోగతి అని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలపై పల్లా రీకౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి టిపిసిసి ప్రెసిడెంట్ ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న దాఖలాలు లేవని విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తోనే తెలంగాణ అన్నపూర్ణగా మారిందిన ప్రశంసించారు. రాహుల్ గాంధీకి ఎన్నికల డ్రామా తప్పితే వ్యవసాయం గురించి తెలియదని పల్లా విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News