Monday, December 23, 2024

బండికి సిగ్గు, శరం ఉందా?: పల్లా

- Advertisement -
- Advertisement -

Palla Rajeshwar Reddy

 

హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగా కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో నిన్న ఢిల్లీ లో మేము చేసిన ధర్నా విజయవంతమైందని రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎంఎల్ సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మా ధర్నా తర్వాత ఎన్నడూ లేనిది ఎఫ్ సిఐ అధికారి పాండే తెలుగు మీడియా తో మాట్లాడారు. పిఎంఒ ఆదేశాలతోనే మాకు పోటీగా బిజెపి హైద్రాబాద్ లో ధర్నా చేపట్టిందని, బిజెపి ధర్నాలో ఎంపి, అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి కుక్కలా మాట్లాడారని మండిపడ్డారు. సంజయ్ వార్డు మెంబర్ స్థాయి కన్నా తక్కువగా దిగజారి మాట్లాడారని, సంజయ్ నోరుతోనే మాట్లాడుతున్నాడా? వేరే అవయవంతో మాట్లాడుతున్నాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధాన్యం సేకరణ ఎలా జరుగుతుందో కూడా బండికి కనీస అవగాహన లేదని, పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని ఎఫ్ సిఐ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఎలా? ఇస్తుందని ప్రశ్నించారు. వరి వేయమని రైతులను రెచ్చగొట్టింది బిజెపి కుక్కలేనని, ధాన్యాన్ని కేంద్రంతో కొనిపిస్తామని చెప్పి మొహం చాటేసింది బిజెపి కుక్కలు కాదా? అని నిలదీశారు. వరికి ధాన్యానికి తేడా తెలియని వెధవ బండి సంజయ్ అని,
పిఎంఒ పంపించిన గోధుమల చిత్రాన్ని ఫ్లెక్సీల్లో పెట్టిన సన్నాసి అని పల్లా చురకలంటించారు.

నూకలు తినమని పీయూష్ గోయల్ అంటే ఆత్మగౌరవం లేకుండా కేంద్రానికి వత్తాసు పలుకుతూ బండి సంజయ్ గుజరాత్ కు గులాం లా మారాడని ఎద్దేవా చేశారు. రైతులకు డబుల్ ఇన్కమ్ కాదు డబుల్ ప్రాబ్లెమ్ ఇచ్చింది బిజెపి అని, గుజరాత్ లో రైతులకు ఎనిమిది గంటలు కూడా కరెంటు కూడా ఇవ్వడం లేదని, తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని,
సిఎం కెసిఆర్ గురించి అనుచితంగా రారా పోరా అని మాట్లాడుతావారా? బండి సంజయ్ పై పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ చావాలని కోరుకోవడం లేదని, ఆయన చస్తే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇప్పిస్తామన్నారు. ఆదానీ కోసమే బిజెపి వ్యవసాయ చట్టాలు తెచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా ల బూట్లు నాకడం తప్ప బండి సంజయ్ కు ఇంకేమైనా తెలుసా అని, సిగ్గు శరం ఉందా?, పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి కుక్కకు ఏ గతి పడుతుందో సంజయ్ కు అదే గతి పడుతుందన్నారు. తనపై ఇడి, ఐటి దాడులు చెపిస్తావా? దమ్ముంటే చేయించాలని పల్లా సవాలు విసిరారు. ఇకపై బిజెపి కుక్కలు ఒకటి అంటే మేము రెండు అంటామన్నారు. నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఖబడ్దార్ బిజెపి నేతలారా అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News