Friday, November 22, 2024

బిజెపోళ్లు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: పల్లా

- Advertisement -
- Advertisement -

 Palla Rajeshwar fire on Etela Rajender

 

హైదరాబాద్: వానాకాలం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, తెలంగాణ వ్యాప్తంగా 6663 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 5 లక్షల 11 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ బిజెపి నేతలు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. బిజెపి జ్ఞానం లేని కార్యకర్తలను తయారు చేస్తోందని పల్లా మండిపడ్డారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేలా రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు చేసే ధర్నాల్లో రైతులే లేరన్నారు. యాసంగిలో వడ్లు వేయాలా వద్దా? కేంద్రం స్పష్టం చేయాలన్నారు.

మార్కెట్లను మూసివేయాలని కేంద్రం చట్టం తెచ్చిందన్నారు. అవగాహన, జ్ఞానం లేకనే బిజెపి నేతలు ధర్నాలు చేస్తున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల దగ్గరికే మార్కెట్లను తీసుకెళ్లిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. బిజెపి నేతల డ్రామాలను తెలంగాణ రైతులు నమ్మడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎంత పంట వేస్తున్నారో కేంద్ర వ్యవసాయ శాఖ దగ్గర లెక్క ఉంటుందన్నారు. పంజాబ్‌లో రెండు కోట్ల టన్నుల ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణలో ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని పల్లా డిమాండ్ చేశారు. బిజెపి సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. బిజెపి నేతలకు రైతుల మీద ప్రేమ లేదన్నారు. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేస్తున్నామన్నారు. మిల్లర్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి వ్యాపార ఒప్పందం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News