Tuesday, January 21, 2025

పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలకు హైకోర్టులో భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : విద్యాసంస్థల కూల్చివేత విషయంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ ఊరట లభించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి చెరువులను కబ్జా చేసి విద్యాసంస్థలు నిర్మించారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో పల్లా హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేగాక శుక్ర వారం విచారణ ముగిసే వరకు అనురాగ్, నీలిమ విద్యాసంస్థలను కూల్చవద్దని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే కొర్రెముల, నల్లచెరువు రికార్డులు సమర్పించాలని ప్రభుత్వానికి చెప్పింది. కాగా చెరువులు, కుంటలు పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ పరిధిలో చెరువు భూమి కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు అందిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడుతోంది. ఈ నేపధ్యంలోనే బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘట్‌కేసర్ మండలం వెంటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో ఉన్న భూమిని ఆక్రమించి అనురాగ్, నీలిమా విద్యాసంస్థలు నిర్మాణాలు జరిపారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విద్యాసంస్థలపై హైడ్రా నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నోటీసులు అందాయి. దీనిపై తమ విద్యాసంస్థలు అన్ని అనుమతు లతోనే నిర్మించామని, ఆక్రమణల పేరుతో అధికారులు తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పల్లా హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News