Wednesday, January 22, 2025

అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గల్లంతు ఖాయం: పల్లా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఆశలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీళ్లు చల్లారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కాళాశాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓవర్వలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను మోడీ కాపీ కొడుతున్నారని, సిఎం కెసిఆర్ ను చూసి మోడీ భయపడుతున్నారని అన్నారు.

మోడీ.. దేశ ప్రధానిగా కాకుండా, ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడారని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసుపై ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను మోడీ అమలు చేయలేదని పల్లా ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గల్లంతు ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం లేదన్నారు. అదానీ-అంబానీల కోసమే మోడీ పని చేస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ చేసేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Also Read: ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 14 మంది మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News