Wednesday, January 22, 2025

అలా జరిగితే.. రాజకీయాల నుండి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 Palla Rajeshwar fire on Etela Rajender

హైదరాబాద్: మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ సీట్లపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్ కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ”తెలంగాణలో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుంది. ఒక్క సీటు కూడా ఇప్పటివరకు మేనేజ్ మెంట్లకు ఇవ్వలేదు. నీకు దమ్ముంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో దర్యాప్తు చేయించుకో. అనురాగ్ కాలేజీల విషయంలో డాక్యుమెంట్లపై ఏ ప్రొఫెసర్ తోనైనా విచారణ చేయించుకో. తప్పు అని తేలితే రాజకీయాల నుండి తప్పుకుంటా. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు.. నీవు మాటమీద నిలబడే వ్యక్తివి కాదు. ఇలాగే వ్యవహరిస్తే మరోసారి ప్రజల ఆగ్రహాన్ని గురికాక తప్పదు” అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

Palla Rajeshwar Reddy slams Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News