ఉద్యోగుల మద్దతు వందశాతం
రాజేశ్వర్‌రెడ్డికే
మెజార్టీ పెంపుపై టిఆర్ఎస్ శ్రేణులు
సారించాలి
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం..
సహకారం మరువలేనిది
ఎగిరెగిరి పడ్తున్న ప్రతిపక్షాలకు
భంగపాటు తప్పదు
తెలంగాణలో సంక్షేమ పథకాలను
చేస్తున్న ఘనత
విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డి
మనతెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తున్న ఘనత ప్రభుత్వ ఉద్యోగులదేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మె టిఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని కోరుతూ, సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీచైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తొలుత పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా జూనియర్ జడ్జి కోర్టులో సివిల్ జడ్జితో పాటు, పలువురు న్యాయవాదులను కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఙప్తి చేశా అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ, ఉద్యోగులతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొ ప్రసంగించారు.
అదేవిధంగా అంతర్జాతీయ మహి దినోత్సవ వేడుకలలో పా పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న పలువురు మహిళలను మంత్రి ఎమ్మెల్యే చిరుమర్తితో కలిసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి విజయం ఎప్పుడో ఖాయం అయ్యిందని,మెజార్టీపై టిఆర్ఎస్ శ్రేణులు దృష్టి సారించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. మండలి ఎన్నికలలో పోలింగ్ శాతాన్ని పెంచేవిధంగా గులాబీ శ్రేణులు కృషి చేయాలని మంత్రి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాక్షసపాలన అని, మోదీ నల్లడబ్బు తెప్పించి, ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో పదిహేను లక్షలు జమ చేస్తానని, కల్లబొల్లి కబుర్లు చెప్పిఅధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు మొండి చేయి చూపించారని మంత్రి జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు.
నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి, రెండు వేల రూపాయల నోటు సృష్టించి నల్లడబ్బు దాచుకునేందుకు కుబేరులకు మరింత వెసులుబాటు కల్పించిన ఘనుడు మోదీ అని మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ తన దోస్తులైన ఆదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడ్తున్నారని, మోదీ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి… ఆదానీ ఆదాయం 700 శాతం, అంబా ఆదాయం 370 శాతం పెరిగిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల్ని విపరీతంగా పెంచుతూ, ప్రజల కంటిపై కునుకులేకుండా చేస్తున్న ప్రధాని మోదీ త్వరలోనే అడ్రస్ లేకుండా గల్లంతు అవుతారని మంత్రి జోస్యం చెప్పారు. ఎగరెగిరి పడుతున్న ప్రతిపక్షాలకు ఎప్పటిలాగానే భంగపాటు తప్పదన్నారు. ప్రొఫెసర్ అని చెప్పుకునే కోదండరాం ప్రతిపక్షాలు చెబుతున్న అబద్దాలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల నాయకత్వంలో ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీరు, వ్యవసాయా పండుగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే నూతన ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుభీమా వంటి పథకా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలు అవుతున్నాయా అని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్పిచైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మా ఎమ్మెల్సీ పూల రవీందర్, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, జడ్పిటిసి మాద ధనలక్ష్మీ నగేష్, పిఏసిఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వర్రావు, ప్రముఖ వైద్యులు రాపోలు రఘనందన్, రాపోలు మంజుల, పట్ట అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకు సకినాల రవి, నాయకులుప్రగడపు నవీన్‌రావు, రాచకొండ వెంకన్న, గుర్రం గణేష్, యల్లపురెడ్డి సైదిరెడ్డి, దైద పరమేష్, యాతాకుల కిరణ్, చౌగోని శంకర్, పల్లె విజ బండమీది శంకర్, సంజయ్‌కుమార్, న్యాయ వాదులు, వైద్యులు పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.