Saturday, November 23, 2024

‘పల్లా’కు పట్టాభిషేకం…. పట్టభద్రుల పరవశం.!

- Advertisement -
- Advertisement -

రెండోసారి సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర సమితి
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరు జయం
అధికారిక ప్రకటన అనంతరం 12వేల806 మెజార్టీ
ధుృవీకరణ పత్రాన్ని అందించిన ఆర్‌ఒ ప్రశాంత్ పాటిల్
రెండోసారి కూడా రెండో ప్రాధాన్యతా ఓటుపైనే గెలుపు
సుధీర్ఘంగా కొనసాగిన ఓట్లు లెక్కింపు ప్రక్రియ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై గులాబి శ్రేణుల సంబరాలు

Palla Rajeswar Reddy won in MLC Elections

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: వరంగ ల్, ఖమ్మం, నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ని యోకవర్గం ఎన్నికల తుదిఫలితాల వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వంపై ప్ర గాఢవిశ్వాసం, నమ్మకంతో పట్టభద్రులు తెలంగాణ రా ష్ట్ర సమతి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పట్టం కట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయకేతనం పట్ల వెల్లివిరుస్తున్న ఆ నందోత్సాహాల మధ్య ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించబోతున్న తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పట్టభద్రులందరు పరవశిస్తున్నారు. సుధీర్ఘంగా నాలుగు రోజుల పాటు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు క్రతువులో ఎట్టకేలకు శనివారం అర్దరాత్రి తుది ఫలితం వెల్లడి కావడంతో ఎదురుచూపులకు తెరపడింది. దీంతో ఎన్నికల సంఘం నుంచి ఎమ్మెల్సీగా గెలుపు ధుృ వీకరణ పత్రం వచ్చిన వెంటనే ఆదివారం ఉదయం పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అందజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి జరిగిన పోరులో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో జరిగిన హోరాహోరీ పోరులో 12వేల 806 ఓట్ల మెజార్టీతో రెండో ప్రాధాన్యత ఓటుపై గెలుపొందారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లక్షా 61వేల 811 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్నకు లక్షా 49వేల 5ఓట్లు వ చ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసనమండలి ప ట్టభద్రుల నియోకవర్గం ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైనప్పటికీ మరోమారు తన స్థా నాన్ని నిలబెట్టుకుంది. పాత స్థానాన్ని నిలబెట్టుకోవడం తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థితో జరిగిన ఉత్కంఠ పో విజయకేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
రౌండ్ రౌండ్‌కు హోరాహోరీ పోరు…
ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్‌రౌండ్‌కు హోరాహోరీ పోరు కొనసాగిందనే చెప్పాలి. టిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆది నుంచి అధిక్యంలోనే కొ నసాగుతూ వచ్చారు. పోటీలో నిలిచిన వారెవరికి 50శా తం ఓట్లు కూడా మించకపోవడంతో తక్కువ ఓట్లు వచ్చి న వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేషన్ చేసుకుంటూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. మొత్త ంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగంలో 71మ ంది బరిలో నిలిస్తే మొత్తం 5లక్షల 5వేల 565ఓట్లు ఉం డగా, 3లక్షల 87వేల 969ఓట్లు పోలవ్వగా వీటిలో వివి ద సాంకేతిక కారణాలతో 21వేల 636ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఇక మిగిలిన 3లక్షల 66వేల 333ఓట్లకు చెల్లుబాటయ్యే ఓట్లుగానూ అధికారులు నిర్దారించారు.దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టిఆర్‌ఎస్ అభ్యర్థి గా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి లక్షా 11వేల 812ఓట్లు సాధించగా, సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 84వేల 118 ఓట్లు, తెలంగాణ జనసమితి పార్టీ అభ్యర్థి గా మూడో స్థానంలో నిలిచిన కోదండరాంకు 71వేల 1 26, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39వేల 306, కాం గ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 27వేల 729 ఓట్లు వచ్చాయి.
సుధీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపుకు ముగింపు..
వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోకవర్గం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చరిత్రలో గుర్తిండిపోయేదిగా చెప్పవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికావడానికి దాదాపు నాలుగు రోజు లు 24గంటల పాటు పనిచేశారు ఎన్నికల క్రతువులో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది. మొత్తానికి పట్టభద్రుల ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రక్రియలో చిన్నాచితాక అభ్యంతరాలు, ఆందోళనలు మినహా ప్రక్రియ యావత్తు ప్రశాంతంగా ముగియడంలో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
సన్నాహక సమావేశాలతో సమన్వయం..
పట్టభద్రుల ఎన్నికల కోసం అధికార టిఆర్‌ఎస్ పార్టీ గడిచిన ఆరుమాసాలుగా తీవ్ర కసరత్తు చేసింది. ఆరుమాసాలుగా సన్నాహక సమావేశాలతో పార్టీ శ్రేణులను సంపూర్ణంగా సన్నద్దం చేస్తూ వచ్చింది. మండలస్థాయితో పాటు నియోజకవర్గ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు విస్ర్తుతంగా నిర్వహించి ఆ తర్వాత ప్రతి ఓటరును స్వయంగా కలిసేందుకు ఇన్‌చార్జీలను నియమించి ప్ర ధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవలి దుబ్బాక అ సెంబ్లీ ఎన్నికలతో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కొంత తడబాటును సరిదిద్దుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు న్యా యవాదులు, ఇంజనీరింగ్ విభాగాలు ఇతరేతర సంఘాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి సఫలీకృతమైందని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News