Wednesday, January 22, 2025

యువతికి పచ్చిమిరపకాయలు తినిపించి… రక్తం కారేలా దాడి చేసి… పరారీలో ఎంఎల్‌ఎ కుమారుడు, కోడలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఎంఎల్‌ఎ కుమారుడు, కోడలు తన ఇంట్లో పని మనిషిగా ఉన్న యువతికి పచ్చిమిరపకాయలు తినిపించి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పల్లావరం ఎంఎల్‌ఎ కరుణానిధి కుమారుడు ఆండ్రో మదివాణన్, కోడలు మెర్లినా ఇంట్లో ఓ యువతి పని మనిషిగా ఉంది. ఇంటి పనులు చేస్తుండగా యువతి పలుమార్లు చిత్రహింసలకు గురి చేశారు.

ఆండ్రో, మెర్లినా ముంబయికి మకాం మార్చడంతో అక్కడికి యువతిని తీసుకెళ్లారు. ఆమె వంటలు సరిగా చేయకపోవడంతో ఆమెపై దాడి చేసి పచ్చి మిరపకాయ తినిపించి హింసించారు. వాతలు పెట్టి రక్తం కారేలా దాడి చేశారు. మూడేళ్లు ముంబయిలో పని చేయాలని సంతకం చేయించుకున్నారు. బయటకు వెళ్తే యువతి తల్లిని చంపేస్తామని బెదిరించారని, కులం పేరుతో దూషించారని సదరు యువతి ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీలాంగరై ఆల్ ఉమెన్ పోలీసులు వారిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లడంతో అప్పటికే ఆ దంపతులు పారిపోయారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ముందస్తు బెయిల్ కోసం సైదాపేట కోర్టులో ఆ జంట ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News