Wednesday, January 22, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్య క్రమంలో సినీ నటుడు నోయల్, ఫిట్నెస్ ట్రైనర్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాళ్లు మాట్లాడుతూ విద్యార్థులకు బాల్యం నుంచే మొక్కలు నాటే విధానాన్ని, మొక్కలు నాటడం వల్ల కలిగే లాభాలపైన అవగాహన కల్పించారు. ఇలా ప్రకృతిని, విద్యను ప్రేమిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వాళ్ళు ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులతో పాటు కాలేజీ విద్యార్థులు కూడా మొక్కలు నాటారు.

ఫిట్నెస్ ట్రైలర్ మోహన్ లాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్కను నాటాలని ఆకాంక్షించారు. అలాగే నటుడు నోయల్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని సంరక్షించాలని కూడా ఆయన విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో అతిథులుగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే కాలేజీ డైరెక్టర్ నవీన్, ప్రిన్సిపల్ డాక్టర్ బాలరాజ్, ఏవో శ్రీధర్, ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ గోవర్ధన్, అలాగే కాలేజీలోని వివిధ విభాగాల హెచ్.ఓ.డీలు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1800 మంది విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్పతనాన్ని చాటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News