Thursday, January 23, 2025

చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ విడుదల..

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదల అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణ కేసులో ప్రశాంత్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ తరుపు న్యాయవాదులు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలు నుంచి కండీషన్ బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదలయ్యారు.

ప్రశాంత్ విడుదల అవుతున్న తెలిసి భారీగా అతని అభిమానులు జైలు దగ్గరకు వచ్చారు. అయితే, ప్రశాంత్ మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ప్రతి నెలా 1వ తేదీ, 16వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశాంత్ సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ ను రద్దు అవుతుందని నాంపల్లి కోర్టు హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News