హైదరాబాద్ : గ్లామన్ మిసెస్ ఇండియా 2020 అందాల పోటీలో విజేతగా పల్లవి సింగ్ కిరీటాన్ని సాధించుకున్నారు. జైపూర్‌లో ‘అత్యంత సుందరమైన చిరునవ్వు’ అనే టైటిల్‌ను కూడా ఆమె సాధించుకున్నారు. ఫిబ్రవరి 23న జరిగిన గ్లామన్ మిసెస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ పోటీల్లో పుణెకు చెందిన షెనెల్లా ఫస్ట్ రన్నర్‌గా రాగా, హైదరాబాద్‌కు చెందిన ఉషా, కోల్‌కతాకు చెందిన షీటల్ సెకండ్ రన్నర్‌గా వచ్చారు. పెళ్తైన తరువాత తన లక్షాన్ని సాధించడానికి తానెంతగా శ్రమించిందీ ఆమె వివరించారు. మధ్యతరగతి నుంచి వచ్చిన బాలికకు ఈ లక్షం సాధించడం ఎంతో సవాలని, హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిన తరువాత కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ అందాల పోటీలో విజయం సాధించడానికి ఎంతో కృషి చేశానని చెప్పారు. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలో సెగ్మెంట్ హెడ్‌గా ఆమె పనిచేస్తున్నారు. కాన్పూర్ నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన పల్లవి గత ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. పల్లవి తండ్రి పేరుకాంచిన రచయిత. తన తెలివైన మాటలతో ఎప్పుడూ పల్లవికి స్ఫూర్తి కలిగించేవారు. పల్లవి తల్లి ఎన్‌జివొను నడుపుతున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ అయిన పల్లవి హైదరాబాద్‌లో ఎంబిఎ చేశారు.హైదరాబాద్‌కు చెందిన కుషాల్‌షాను ఆమె వివాహమాడారు.