మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్(హెచ్‌సిఎఎ) అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరుగగా, అర్థారత్రి పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. పల్లె నాగేశ్వర్‌రావుకు 1,120 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ఎ.జగన్‌కు 739 ఓట్లు వచ్చాయి. దీంతో 381 ఓట్ల మెజారిటీతో నాగేశ్వర్‌రావు గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు గత 29 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్లీడర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, స్టాండింగ్ కౌన్సిల్‌గా, అసిస్టెంట్ గవర్నర్ ప్లీడర్‌గా వివిధ హోదాలలో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. దళిత సామాజికి వర్గానికి చెందిన న్యాయవాది దేశంలోనే తొలిసారిగా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.