- Advertisement -
వరంగల్: శుక్రవారం నుంచి 15 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరులో ఉదయం 9 గంటలకు పల్లెప్రగతి కార్యక్రమాన్ని లాంఛనంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు గంటలకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు.
రాయపర్తి మండలం బంధన పల్లి గ్రామ శివారు చెరువులో ఉపాధి హామీ పథకం కింద చెరువు పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు ఎర్రబెల్లి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి గడ్డపార పట్టి మట్టిని తవ్వారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును కూలీలను అడిగి తెలుసుకున్నారు. వారికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు. కూలీలు, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ కుమార్ పాల్గొన్నారు.
- Advertisement -