Wednesday, January 22, 2025

‘పల్లె ప్రగతి’తోనే మార్పు

- Advertisement -
- Advertisement -

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపు రేఖలు…
గ్రామాల అభివృద్ధికి నూతన చట్టం తీసుకొచ్చిన సిఎం కెసిఆర్
ప్రతి పల్లెలో నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్ యార్డు నిర్మాణం
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ది చేసిన తాగునీటి జలాలు సరఫరా
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పల్లె ప్రగతి దినోత్సవం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని ప్రతి పల్లె దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే రాష్ట్రం తెలంగాణ. సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీ రాజ్ చట్టం అమలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుంది. 1851 అవాసాలను తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు చేసి 5441 నూతన గ్రామపంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడ్డాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శులు నియమాకంతో పాటు ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ పేరు సంపాదించుకుంది. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 14,456 గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా క్రమం తప్పకుండా ప్రతి గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేస్తుంది.
9 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పల్లె ప్రగతి విజయాలు :

ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకరు, ట్రాలీ:
గ్రామ పారీశుధ్య వ్యవస్థను మార్చేందుకు 12,789 గ్రామ పంచాయితీల్లో 1,276 కోట్లలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. గుంతలను పూడ్చడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లు, బావులు పూడ్చడం, పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజు డంపింగ్ యార్డ్ కు తరలించడానికి ట్రాక్టర్లు ట్రాలీలు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రగతి వనాలు:
ప్రతి గ్రామాల్లో ఎకరానికి తగ్గకుండా ఇప్పటివరకు 19472 పల్లె ప్రగతి వనాలు ఏర్పాటయ్యాయి. 3297 ఎకరాల విస్తీర్ణంలో 2725 బృహత్ పల్లె ప్రగతి వనాలు వివిధ దశలో ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని గ్రామ ప్రాంతాలలో 9242 కిలోమీటర్ల పొడవైన మల్టీ లేయర్ ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డుల నిర్మాణం చేసి 36 లక్షల కి. గ్రా. కంపోస్ట్ ఎరువు సేకరించి వ్యవసాయానికి వినియోగించబడింది.

తెలంగాణ క్రీడా ప్రాంగణాలు:
యువత ఆడుకోవడానికి 14,456 గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడమైనది. ఈ క్రీడా ప్రాంగణంలో పిల్లలకు యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడమైనది.
మిషన్ భగీరథ:
మనిషికి ప్రాణాధారమైన సురక్షితమైన మంచినీటి సరఫరా చేసి తద్వారా ప్రజల కష్టాలు తీర్చడానికి, అంటూ వ్యాధులు అరికట్టడానికి , ఫ్లోరైడ్ సమస్యలు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పూర్తి చేసి, ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం కల్పించింది.

గ్రామీణ విద్యుత్తు సరఫరా:
ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో రూ. 314.94 కోట్ల ఖర్చుతో 2.99 లక్షల కొత్త విద్యుత్తు స్తంభాలను అమర్చి, వంగిపోయిన, తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేసి, వదులుగా ఉన్న కరెంటు తీగలను బిగించి పటిష్టపరచడం జరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన దళిత, గిరిజన ఆవాస ప్రాంతాలలో 5.39 లక్షల మీటర్ల మూడవ వైర్ ను ఏర్పాటు చేయడం జరింది.
పరిపాలన సంస్కరణలు:
ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి నియమించింది. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాన్ని రూ.9500లకు పెంచింది. స్థానిక ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. కొత్త పంచాయితీరాజ్ చట్టం తెచ్చింది.

పల్లె ప్రగతికి ప్రజా సైన్యం:
పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా గ్రామాలలో స్టాండింగ్ కమిటీలలో ప్రజలను భాగస్వాములను చేసింది. వరక్స్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్స్ కమిటీ గ్రీన్ కవర్ కమిటీ ఇలా ఒక్కో గ్రామంలో నాలుగు కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఈ కమిటీల్లో 8,20,727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు.
గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరత తీరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం:
కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు 85%, పంచాయతీలకు 10 శాతం, జిల్లా పరిషత్లకు 5 శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తున్నది.
అవార్డుల సెంచరీ: దేశంలోనే అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు సాధించింది. ఇంకా గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ అవార్డులు గత తొమ్మిది ఏళ్ల నుండి ఇప్పటి వరకు 94 అవార్డులను సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News