Sunday, January 19, 2025

ఆ నాలుగు జిల్లాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టిఎస్ఆర్ టిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో సోమవారం ఈ బస్‌ పాస్‌ పోస్టర్లను సంస్థ ఎండి విసి సజ్జనార్‌, ఐపిఎస్ ఆవిష్కరించారు. తొలుత నాలుగు జిల్లా కేంద్రాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి నాలుగు జిల్లా కేంద్రాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ ఇవ్వనున్నారు. తొలుత కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో అమలు కానుంది. పది కిలో మీటర్ల పరిధిలో అయితే నెలకు రూ.800కు పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ ఇవ్వనున్నారు. ఐదు కిలో మీటర్ల పరిధిలో నెలకు రూ.500కు పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ ఇవ్వనున్నారు. పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్ పోస్టర్లను ఎండి సజ్జనార్ ఆవిష్కరించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News