- Advertisement -
దమ్మపేట : మండల పరిధిలోని పట్వారి గూడెం గ్రామంలో నాలుగు ఎకరాల పామాయిల్ తోట షార్ట్ సర్కూట్‌తో కాలిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెలికాని భాస్కర రావు అనే రైతు రోజు లాగే పొలంలో మోటర్ వేసి నీరు మొక్కలకు పెట్టి వెళ్ళాడు. మరుసటి రోజు వచ్చి చూడగానే షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది.
చేతికందిన పామాయిల్ తోట దగ్ధం అవడంతో రైతు కన్నీటి పర్యంతం అయ్యాడు. విషయం తెలుసుకున్న దమ్మపేట జెడ్పిటిసి వెంకటేశ్వరరావు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, కొయ్యల అచ్యుతరావు తదితరులు రైతును పరామర్శించి ప్రభుత్వపరంగా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -