Monday, December 23, 2024

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి

- Advertisement -
- Advertisement -

Palvai Sravanthi as Munugode Congress candidate

నల్గొండ: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని శుక్రవారం ప్రకటించింది. మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరును పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఎట్టకేలకు మునుగోడులో సస్పెన్స్ వీడి, ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా రోజుల పాటు తర్జన భర్జనలు పడి చివరకు కాంగ్రెస్ పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పాల్వాయి స్రవంతి పేరును ఫిక్స్ చేసి అధిష్ఠానానికి పంపించారు. అధిష్ఠానం కూడా కొద్ది సేపటి క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణరెడ్డి, పల్లె రవికుమార్, కైలాస్ తదితరులు పోటీ పడ్డారు.

Palvai Sravanthi as Munugode Congress candidate

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News