Monday, January 20, 2025

బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి..

- Advertisement -
- Advertisement -

మునుగోడు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె భారాసలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించిన స్రవంతికి నిరాశే ఎదురైంది. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కాంగ్రెస్ మునుగోడు టికెట్ ఇచ్చింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News