Sunday, December 22, 2024

కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ది..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోగా, ప్రస్తుత అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె తీవ్ర అసంతృపి, ఆవేదనను వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై, పిసిసి అధ్యక్షుడి రేవంత్‌పై ఆమె నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆమె ఆవేదన చెందారు. నేడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు కేవలం డబ్బు అనే నినాదంతో నడుస్తుందని ఆమె ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎంత మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తు వేలం పాటగా మారిందని స్రవంతి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.

కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ది..!

కనీసం మహిళ అనే గౌరవం కూడా కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వలేదన్నారు. రేపటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. పార్టీ ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. వాళ్లు ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌ది అని అనడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి తన వంతుగా పని చేశానని ఆమె తెలిపారు.

కానీ, నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తుందన్నారు. ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని పాల్వాయి స్రవంతి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న మూడు పార్టీల్లో బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని తనకు అనిపించిందన్నారు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే పార్టీ బిఆర్‌ఎస్ అని స్రవంతి అన్నారు. ప్రతి పార్టీలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఆ లోటుపాట్లను సవరిస్తూ అందరిని కలుపుకొని ముందుకు పోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News