పాల్వంచ : మున్సిపాలిటీలో గల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని సిపిఐ పార్టీ జిల్లా కార్యర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా ఆరోపించారు. పట్టణంలో తాగునీటికి శాశ్వత పరిష్కారం, ప్రజా సమస్యలను వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చండ్రా రాజేశ్వరరావు భవన్ నుండి భారీ ప్రధర్శనగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొన్నారు. ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా సాబీర్‌పాషా మాట్లాడుతూ …గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఉన్న పాల్వంచలో ఉన్న వార్డులలో కనీస అవసరాలను కల్పించటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. గత 25 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవటంతో పాల్వంచ పట్టణం సమస్యల వలయంలో చిక్కుకొందన్నారు.
తక్షణమే పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటికి నాలు వైపులా పుష్కలంఐన నీటి వనరులు ఉన్నాయన్నారు. అయినా అధికారులు తాగునీటిని నిరంతరంగా సరఫరా చేయటం లేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామని గొప్పలకు పోయి కిన్నెరసాని, మొ్రడ్రువాగు పంప్ హౌజ్‌లను నిరుపయోగంగా చేయటం వలన నేడు పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. మున్సిపాలిటీలో గల మారుమూల గ్రామాలలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌లను కూడా వేయలేదాన్నారు. తక్షణమే పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజల కనీస అవసరాలైనతాగునీరు, డ్రైనేజీలు, వీధి లైట్స్, అంతర్గత రహదారుల నిర్మాణం, ఇంటి నెంబర్లు తదితర సమస్యలను నెరవేర్చాలన్నారు. లేనిచో కార్యాలయానికి తాళం వేసుకోవాలని సూచించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సబ్యులు ముత్యాల విశ్వనాధం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, జిల్లా సమితి సబ్యులు ఉప్పుశెట్టి రాహుల్, వి. పద్మజ, డి. సుధాకర్ ప్రజా సమఘాల నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, శనగరపు శ్రీనివాస్, నరహరి నాగేశ్వరరావు, జ్యోతుల రమేష్, గాలి పద్మ, లక్షి, సంఘమిత్ర, ఈశ్వరమ్మ, క్రిష్ణవేణి, బిక్కులాల్, కోటి కోటేశ్వరరావు, నాగమల్ల సత్యనారాయణ, వాడె లక్షి, రవి, కిరణ్, బాలు, రమేష్, రాజు, జ్యోతి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.