Wednesday, January 22, 2025

కరీంనగర్ కలెక్టర్‌గా పమేలా సత్పత్తి

- Advertisement -
- Advertisement -

నియమిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ

మన తెలంగాణ/ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కలెక్టర్ గోపీతో పాటు, సీపీ సుబ్బారాయుడును బదిలీ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో పమేలా సత్పతి, అభిషేక్ మహంతిని నియమించింది.

పమేలా సత్పతి 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు భద్రాచలం జిల్లా సబ్ కలెక్టర్, వరంగల్ కమిషనర్, యాదాద్రి కలెక్టర్‌గా సేవలంది డైనమిక్ అధికారిగా పేరు పొందారు. అభిషేక్ మహంతి 2011 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాచకొండ ట్రాఫిక్-1 డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News