- Advertisement -
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో పొగ ప్రయోగానికి దిగి సంచలనం సృష్టించిన బృందం ప్రధాని మోడీని ఉద్ధేశిస్తూ కరపత్రాలు పట్టుకుని వచ్చినట్లు వెల్లడైంది. ఇప్పుడు ఘటనాస్థలిలో దొరికిన పాంప్లెట్స్, పట్టుబడ్డ నిందితుల విచారణలో ఈ విషయం స్పష్టం అయింది. ఢిల్లీకోర్టు ముందు స్థానిక పోలీసులు ఈ కరపత్రాల గురించి తెలియచేశారు. కన్పించని ఆసామీ అని, ఆయన ఎవరికైనా కన్పిస్తే , తగు సమాచారం అందిస్తే వారికి స్విస్‌బ్యాంక్ నుంచి తగు పారితోషికం ఇస్తామని కూడా పేర్కొంటూ పాంప్లెట్స్‌లో తెలిపారు. ఇప్పుడు ఈ కరపత్రాలలోని విషయాలు కూడా చర్చనీయాంశాలు అయ్యాయి. సమస్యలపై చర్చకు వెరుసున్న ప్రధానిని నిలదీసేందుకు తాము పార్లమెంట్‌లోకి దూకుడుగా వెళ్లామని, అయితే ఆయన అక్కడ లేకపోవడంతో కరపత్రాలు అక్కడనే వదిలిపెట్టినట్లు ఈ నిందితులు పోలీసులకు తెలిపారు.
- Advertisement -