Sunday, January 5, 2025

పాన్-ఆధార్ లింక్ గడువు ఈ నెలాఖరే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 31లోగా ఈ పని చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పనిచేయలేదు. సిబిడిటి(కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) 2022 జూన్ 30 నుండి పాన్‌ను ఆధార్‌తో లింక్ చే యడానికి రూ. 1000 ఆలస్య రుసుమును వసూలు చేస్తోంది.

లింక్ చేయని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉండదు. అనుసంధా నం చేయని పాన్ కార్డును ఎక్కడైనా డాక్యుమెంట్‌గా ఉపయోగిస్తే భారీ జరిమానాలు వి ధించవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 272బి ప్రకారం, రూ. 10,000 వర కు జరిమానా విధించే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News