Wednesday, January 22, 2025

ఇదే లాస్ట్ చాన్స్.. త్వరపడండి

- Advertisement -
- Advertisement -

ఇదే లాస్ట్ చాన్స్.. త్వరపడండి
పాన్‌తో ఆధార్ అనుసంధానంపై ఐటి శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోనివారు వెంటనే లింక్ చేసుకోవాలని ఆదాయం పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మరోసారి గుర్తు చేసింది. లేదంటే పాన్‌కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఐటి శాఖ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.‘ ఆదాయం పన్ను చట్టం, 1961ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వినియోగదారులందరూ తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31వరకు మాత్రమే గడువు ఉంది. ఒక వేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారుతుంది.

గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఈ రోజే అనుసంధానం పూర్తి చేయండి’ అని ట్విట్టర్‌లో పేర్కొంది. పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో పెనాల్టీతో అనుసంధానికి ప్రస్తుతం అనుమతిస్తున్నారు. ఒక వేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయకపోతే పాన్ నిరుపయోగంగా మారి బ్యాంకు ఖాతాలు కానీ, డిమ్యాట్ అకౌంట్లు కానీ తెరవడానికి వీలుండదు. అందువల్ల వీలయినంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఐటి శాఖ ట్విట్టర్‌లో సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News