Sunday, January 19, 2025

ఒడిశాలో పాన్‌ఇండియా జాబ్ రాకెట్ మోసం బట్టబయలు

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక దిన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు కాజేసే పాన్‌ఇండియా జాబ్ రాకెట్ మోసం ఒడిశాలో బట్టబయలైంది. ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఇఒడబ్లు) ఈ రాకెట్‌ను ఛేదించింది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు ఒడిశాకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు. ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్న గ్యాంగ్ ఒడిశా, జమ్ముకశ్మీర్,గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర అనేక రాష్ట్రాల్లో చురుకుగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని బయటపడింది. నిందితులు గత కొన్ని నెలలుగా ఒడిశాలో అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు.

వీరి నుంచి నేరానికి ఆధారాలుగా ఉన్న కొన్ని డాక్యుమెం ట్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఎటిఎం కార్డులు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. దినపత్రికల్లో ఇస్తున్న ప్రకటనల ఆధారంగా ఈ కేసును సుమోటోగా తీసుకుని ఇఒడబ్లు దర్యాప్తు ప్రారంభించింది. ఒడిశా లోని కొన్ని స్కూళ్లలో నాన్‌టీచింగ్ పోస్టులు ఇప్పిస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసగిస్తోంది. ఒడిశాకు సంబంధించి మాత్రమే ఈస్కామ్‌పై దర్యాప్తు చేపట్టామని, మిగతా రాష్ట్రాలను కూడా దీనిపై అప్రమత్తం చేశామని ఒడిశా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News