Monday, January 20, 2025

పాన్ ఇండియా ఆఫర్

- Advertisement -
- Advertisement -

Pan India offer for Mahesh Babu

 

బాహుబలి, పుష్ప వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో టాలీవుడ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. టాలీవుడ్ హీరోలు, వాళ్ల మార్కెట్‌పై ఇప్పుడు బాలీవుడ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్‌బాబు త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాపై సంతకాలు చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ‘దంగల్’ దర్శకుడు నితిష్ తివారి రామాయాణం గాథని వెండి తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూ.500 కోట్లతో రూపొందించాలన్నది ప్లాన్. రాముడి పాత్ర కోసం మహేష్‌బాబుని సంప్రదించారని తెలిసింది. ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్స్ మహేష్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని, అతను ఓకే అంటే డీల్ పక్కా చేస్తారని సమాచారం. ఒకవేళ మహేష్ నో చెబితే… రణబీర్ కపూర్‌తో రాముడి పాత్ర చేయించడానికి సిద్ధమవుతారట. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ మాత్రం మహేష్‌బాబునే. అయితే గతంలో బాలీవుడ్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినా మహేష్ పెద్దగా స్పందించలేదు. మరి ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News