Tuesday, April 15, 2025

ఆద్యంతం ఆసక్తికరంగా టీజర్

- Advertisement -
- Advertisement -

రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ మారుతి టీజర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘పాంచ్ మినార్ టైటిల్ చాలా బాగుంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది. ఈ సినిమా రాజ్ తరుణ్‌కి మంచి హిట్‌ను అందిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని చెప్పడానికి కారణం మా డైరెక్టర్ కష్టం ఆయన విజన్. నిర్మాతలు ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ యాక్టర్.

అనంత శ్రీరామ్ గారు ఈ సినిమాలో చాలా చక్కని పాట రాశారు. బ్రహ్మాజీతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ కందుల మాట్లాడుతూ…‘పాంచ్ మినార్ అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. ఇందులో చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ ఎనర్జీ మీ అందరికీ తెలుసు. చాలా అద్భుతంగా నటించారు’ అని పేర్కొన్నారు. నిర్మాతలు ఎంఎస్‌ఎం రెడ్డి, గోవిందరాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అందరినీ కడుపుబ్బ నవ్వించేలా ప్రయత్నం చేశాం. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాశీ సింగ్, ఎస్‌కెఎన్, సౌయి రాజేష్, బ్రహ్మాజీ, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News