Sunday, December 22, 2024

ఎసిబికి చిక్కిన పంచాయితీ కార్యదర్శి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఖమ్మం రూరల్‌: ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం లంచం తీసుకుంటూ ఓ పంచాయితీ కార్యదర్శి ఏసిబీ అధికారులకు దొరికాడు. ఏసిబి డిఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన దేశబోయిన నాగేశ్వరరావు ఏదులాపురం పంచాయితీలోని చంద్రనగర్‌లో నూతన ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు.

దీనికి గాను ఇంటి నెంబర్ కోసం కార్యదర్శిని కలవగా రూ. 20 వేలు ఇస్తే పని అవుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని సదరు ఫిర్యాదుదారుడు గత పది రోజుల క్రితం ఏసీబీకి సమాచారం అందించాడు. బుధవారం కార్యదర్శి పాషాకు పంచాయితీ కార్యాలయంలో రూ. 6 వేలను అందిస్తుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఏసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News