Sunday, December 22, 2024

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

- Advertisement -
- Advertisement -

జక్రాన్‌పల్లి: నాలుగు వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఒక్కరు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండేడ్‌గా చిక్కారు. ఈ సంఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో జరిగింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల నిఖిల్ అనే యువకుడు ఇటీవల తొర్లికొండలో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దానిని రిజిస్ట్రేషన్ కోసం ఎన్‌ఓసి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి తోపారం మనోహర్‌ను సంప్రదించారు. కాని అతడు రూ. 15 వేల లంచం ఇస్తేనే దృవీకరణ పత్రం ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎసిబి అధికారుల సూచనల మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మనోహర్ రూ. 4 వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఇంచార్జి ఎసిబి డిఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్స్‌పెక్టర్‌లు నగేష్, శ్రీనివాస్, వెంకటరాజగౌడ్‌లు సిబ్బందితో దాడి చేసి రెడ్‌హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. మనోహర్‌ను అరెస్టు చేసి కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరు పరుస్తామని ఎసిబి మెదక్ రేంజ్ ఎసిబి డిఎస్పీ నిజామాబాద్ ఇంచార్జి ఎసిబి డిఎస్పీ ఆనంద్‌కుమార్, ఇన్స్‌పెక్టర్‌లు నగేష్, శ్రీనివాస్, వెంకటరాజాగౌడ్,సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News