- Advertisement -
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్‌పూర్ గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి జగన్నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పని చేస్తున్న పంచాయతీలో తనకు మర్యాదలేదని, బెదిరింపులకు ఎక్కువగా గురి చేస్తున్నారని, బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అతను సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. గ్రామంలో నీచ రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. తనను క్షమించాలని అమ్మా,నాన్నలను కోరుకుంటూ, తన కుటుంబానికి అప్పులున్నాయని,వాటిని తీర్చేందుకు , తోటి గ్రామ కార్యదర్శులు సాయపడాలని అతను వేడుకున్నాడు. మృతుడిది పుల్కల్ మండలం ఇసోజిపేట గ్రామం. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందారు.
- Advertisement -