Thursday, November 14, 2024

బిఆర్‌ఎస్ పాలనలోపంచాయతీ వ్యవస్థ పటిష్టం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి

దౌల్తాబాద్: బీఆర్‌యస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ పటిష్టంగా మారిందని నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిదిలోని సూరాయిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిం చనున్న పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వ హించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మట్లాడుతూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకుల పాలనలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్య మైందన్నారు. పంచాయతీలకు నిధులు లేక గ్రామాలు అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం నూతన తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలకు సమృద్దిగా నిధులు మంజూరు చేయబడుతు న్నాయన్నారు. గ్రామాలలో అంతర్గతః రహాదారులు, మురుగు కాల్వల నిర్మాణాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, క్రిమిటోరియం తదితర అభివృద్ది పనులతో గ్రామాలు అభివృద్దిలో శర వేగంగా ముం దుకు దూసుకు వెళుతున్నాయన్నారు.

పల్లె సీమలు దేశానికి పట్టుకొ మ్మలన్న నానుడిని నిజం చేస్తూ గ్రామాల అభివృద్దికి చిత్త శుద్దితో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు తిరిగి ఆదరించాలని ఎమ్మెల్యే ఈ సందర్బంగా ప్రజలను కోరారు.అంతకు ముందు గ్రామంలో డీఆర్‌డీఓ పీడీ కృష్ణన్‌తో కలిసి ఎమ్మెల్యే హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్‌పీటీసీ సభ్యుడు కోట్ల మహిపాల్, ఏపీఓ రజినీకాంత్, ఈసీ కృష్ణహరి నాయ కులు మోహన్‌రెడ్డి, నర్వోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News