Wednesday, January 22, 2025

అధికారుల నిర్లక్ష్యం..కార్మికుడు బలి

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ ః విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వీధి దీపాలు బిగిస్తున్నా మానే దత్తా ( 40) అనే పంచాయతీ కార్మికుడు విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం … కొల్హారి గ్రామంలో విద్యుత్ బల్బులు బిగించేందుకు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ నుండి ఎల్సి తీసుకొని సంబంధిత లైన్‌మెన్‌తో పాటు పంచాయతీ వర్కర్ మానే దత్త విద్యుత్ బల్బులు బిగించేందుకు విద్యుత్ స్థంభాలు ఎక్కారని తెలిపారు. పలు చోట్ల విద్యుత్ బల్బులు అమర్చిన అనంతరం గ్రామంలో మరో విద్యుత్ స్థంభానికి బల్బు బిగించేందుకు మానే దత్తా స్థంభం ఎక్కాడు ఈ క్రమంలో స్థంభానికి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ ఘాతానికి గురై కిందపడి చనిపోయాడని తెలిపారు.

సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారుల నిర్లక్షం వలనే దత్తా చనిపోయాడని అతని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆధుకుంటామని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేపట్టే వరకు ఆందోళన విరమించబోమని బిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఈ విషయం తెలుసుకున్నా ఎంపిడిఓ సునిత , విద్యుత్ ఎఈ గౌతమ్, ఇచ్చోడ సీఐ చంద్ర శేఖర్, నేరెడిగొండ ఎస్సై సాయన్న, గుడిహత్నూర్ పోలీస్ సిబ్బంది గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు.విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ తరపున మృతుని కుటుంబానికి 13 లక్షల రూపాయిల నష్టపరిహారంతో పాటు మృతుడి భార్యకు రెండు సంవత్సరాల పాటు మృతుని జీతభత్యం చెల్లిచడంతోపాటు రెండు సంవత్సరాల అనంతరం మృతుడి భార్య గ్రామ పంచాయతీలో వర్కర్‌గా పని చేసుకోవచ్చని గ్రామస్తులకు వివరించడంతో గ్రామస్తులు సమ్మతించి ఆందోళన విరమించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ బలిరాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News