Thursday, January 23, 2025

కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేసే మల్టీపర్పస్ కార్మికులు ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు సమ్మెబాట పట్టారు.గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తమను మల్టీపర్పస్ కార్మికులుగా పేర్కొనటం తగదని, ‘మల్టీ పర్పస్’ అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడిస్తున్న రూ.2500 సరిపోవడం లేదని. కనీస వేతనంగా రూ.19600 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలలకు ఓసారి గ్లౌజులు అందించాలని, వారాంతపు సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని, ఆరోగ్యకార్డులు, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేస్తున్నాను. ఏటా రెండు జతల దుస్తులు అందించాలని కోరుతున్నారు. వీరి ఆందోళననకు విపక్ష పార్టీలకు చెందిన నేతలు సంఘీభావం తెలిపారు. తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని వారు వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News