Monday, December 23, 2024

సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు మెరుగైన జీతాలు పెంచాలి : నర్సిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు మెరుగైన జీతాలు పెంచాలని ఉపాధ్యాయ ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 45వేల మంది సమ్మె చేస్తున్నారని, వారికి మెరుగైన జీతాలు పెంచాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలు అయినందున వారు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పిఆర్‌సి/ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. టెంపరరీగా పనిచేస్తున్న హోమ్ గార్డ్‌ను పర్మినెంట్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, రాష్ట్రంలో మూడు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు జీత భత్యాలు బాగున్నప్పటికీ వారు పగలు పాఠాలు చెబుతూ, రాత్రిపూట విద్యార్థి విద్యార్థులను చూసుకోవడం ఇబ్బంది అవుతున్నందున విద్యార్తుల కోసం కేర్ టేకర్ ను ప్రతి రెసిడెన్షియల్ స్కూలుకు ఇద్దరు కేర్ టేకర్స్‌ను నియమించాని కోరారు. 317 జీఓ వల్ల ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులను తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలన్నారు. అన్ని విషయాలపై సమగ్రంగా చర్చ జరపాలంటే సమావేశాలు మరో వారం రోజులు పొడిగించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News