Monday, December 23, 2024

ప్యాంక్రియాటైటిస్ పై అశ్రధ్ధ పనికిరాదు

- Advertisement -
- Advertisement -

ప్యాంక్రియాటైటిస్ అనేది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంధి ) లో అనుకోకుండా వచ్చే వాపు. ఇది అనుకోకుండా వచ్చి కొన్ని రోజులు, సంవత్సరాల వరకు ఉండవచ్చు. ప్రారంభదశలో దీన్ని కనుగొనడం కష్టం. ప్యాంక్రియాటైటిస్ తీవ్రమైన దశలో నిర్ధారణ అయితే అంతగా నయం కాదు. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ కు సంబంధించి నిర్వహించిన అధ్యయనంలో ముఫ్పైఏళ్ల పరిణామాలను విశ్లేషించారు. 204 దేశాలు, ప్రాంతాల్లో అధ్యయనం చేయగా, ఇది రానురాను విస్తరిస్తోందని తెలుస్తోంది. 2019 లో 28,14,972 .3 తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ కేసులు నమోదు కాగా, 1,15,053.2 మంది చనిపోయారని తేలింది. దీనికి కారణం అనేక వ్యసనాలతో కూడిన జీవనశైలి అని తేలింది. భారీగా మద్యం సేవించడం,ధూమపానం వల్ల 25శాతం ప్యాంక్రియాటైటిస్ కేసులు కనిపిస్తున్నాయి. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ కేసులు 40 శాతం వరకు ఉంటున్నాయి. కొన్ని మందులు అతిగా వాడడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరగడం, కడుపు సర్జరీ వంటివి కూడా ప్యాంక్రియాటైటిస్‌కు కారణమవుతున్నాయి.

హార్మోన్ల అసాధారణతలు, వంశపారంపర్య పరిస్థితులు, ఊబకాయం, కూడా కారణమవుతున్నాయని చెబుతున్నారు. ప్యాంక్రియాటైటిస్ కారణంగా అడపాదడపా నొప్పి రావచ్చు, లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. కొన్నిసార్లు పొత్తి కడుపు చాలా నొప్పిగా ఉంటుంది. ఈ రోగులు ఆహారం తీసుకున్న తరువాత లేదా పడుకున్నప్పుడు పొత్తి కడుపు పై భాగంలో నొప్పిని అనుభవిస్తుంటారు. అలాంటప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వైద్యుడ్ని సంప్రదించాలి. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా తీవ్రమైన అనారోగ్యం. ఈ సందర్భంలో మరణాల సంఖ్య 20 శాతం నుంచి 30 శాతం వరకు ఉంటుంది. వాస్తవానికి దీన్ని నయం చేయవచ్చు. ఆల్కహాలు , ధూమపానం మానేస్తే చాలా వరకు మేలు జరుగుతుంది. తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ రోగులు గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషల్ ఆస్పత్రుల్లో చేరాలి. అక్కడ ఐసియులో ఉంచి అన్ని వైద్యసేవలు అందిస్తారు. రక్తపోటును నిర్వహించడం, మూత్రపిండాలు , ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపర్చడం చేస్తారు.

ప్యాంక్రియాస్ అనేది 12 నుండి 20 సెం.మీ పొడవు కలిగిన అవయవం. గర్భాశయం లోపల , కడుపు వెనుక , కాలేయం కింద, తల, మెడ, శరీరం, తోక విభాగాలను కలిగి ఉంటుంది. దీని తల విభాగం చిన్న ప్రేగు (డ్యూడెనమ్) మొదటి భాగానికి కలుపుతుంది. మెడ ఉన్నతమైన మెసెంటెరిక్ నాళాల దగ్గర , కడుపు వెనుక గోడ వెనుక ఉంటుంది. తోక ప్లీహం వరకు వ్యాపించి ఉంటుంది. ప్యాంక్రియాటిక్ ద్రవంలో ఎలక్ట్రోలైట్స్, నీరు, ఎంజైమ్‌లు ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బైకార్బొనేట్ ద్రవం , జీర్ణక్రియ ఎంజైమ్‌లైన అమైలేస్, ట్రిప్సిన్, న్యూక్లియస్, ఎలాస్టీస్, చైమోట్రిప్సినోజెన్, కార్బాక్సిపెప్టిడేస్ ,ఎంజైమ్‌లు లైపేస్ ఇవి ఆహారంలో కొవ్వు, ప్రొటీన్, కార్బొహైడ్రేట్ల జీర్ణక్రియకు చాలా అవసరం అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News