Friday, November 22, 2024

మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసి పోలేదు: డబ్లుహెచ్‌వొ

- Advertisement -
- Advertisement -

Pandemic is changing but not over: WHO

జెనీవా : కరోనా మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసి పోలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. కొత్త కేసులు నమోదు, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడంతో వైరస్‌ను ట్రాక్ చేయగల సామర్ధం ప్రమాదంలో ఉందని, దాంతో ఒమిక్రాన్‌ను గుర్తించడం, భవిష్యత్ వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోంద బీఏ 4, బీఏ 5 సబ్ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని డబ్లుహెచ్‌వొ అధిపతి టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు. “ అన్ని దేశాలూ తమ జనాభాలో 70 శాతం మందికి టీకా వేయాలని మేం సూచించాం. 18 నెలల్లో 12 బిలియన్ల టీకాలు పంపిణీ అయ్యాయి. కానీ అల్పాదాయ దేశాల్లో మాత్రం ఇంకా అర్హులకు టీకాలు అందడం లేదు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్షాన్ని చేరుకున్నాయి. పేద దేశాల్లో దీన్ని సాధించడం కష్టమని కొందరు అంటున్నారు. ఈ సమయంలో వైరస్ నిరంతర వ్యాప్తి గురించి ఆందోళనగా ఉంది. దానివల్ల పిల్లలు, గర్భిణులు , రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ” అని అప్రమత్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News