Thursday, December 19, 2024

పండిట్, పి.ఇ.టి.లకు పదోన్నతులు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

విద్యాశాఖ మంత్రి సబితకు పిఆర్‌టియుటిఎస్ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్‌లోనే పండిట్, పి.ఇ.టి.లకు కూడా పదోన్నతులు కల్పించాలని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని,పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనను కలిసి వినతిపత్రాలు అందచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లాంగ్వేజ్ పండిట్, పి.ఇ.టి.ల అప్‌గ్రెడేషన్ సమస్యకు సంబంధించిన కోర్టు కేసు తుదితీర్పును న్యాయస్థానం వెలువరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయులకు జరుగుతున్న పదోన్నతుల షెడ్యూల్‌లోనే వీరికి కూడా ప్రమోషన్లు కల్పించాలని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎంఎల్‌సి కూర రఘోత్తం రెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవ రెడ్డి కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే పండిట్, పి.ఇ.టి.లకు కూడా పదోన్నతులు కల్పించేందుకు అంగీకరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 317 జి.ఓ. అమలు అనంతరం కోర్టు కేసులు, అక్రమ ఉత్తర్వులు తదితర కారణాల వల్ల రంగారెడ్డి, మేడ్చల్ సహా పలుజిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలు పూర్తిగా లేకుండా పోవడంతో ఉపాధ్యాయ పదోన్నతులకు, ఆయా జిల్లాల్లోని నిరుద్యోగులకు ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా ఈ జిల్లాలకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని మంత్రి సబితను పిఆర్‌టియుటిఎస్ నాయకులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News