- Advertisement -
న్యూఢిల్లీ: కథక్ నాట్య కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ ఇకలేరు. 83 సంవత్సరాల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు బిర్జూ మహరాజ్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఉమ్రావ్ జాన్,దేవదాస్, బాజీరావు మస్తానీ చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. బిర్జూ మహరాజ్ 1986 లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. కళాశ్రమం పేరుతో ఢిల్లీలో నృత్య పాఠశాల స్థాపించారు. దేశ, విదేశాల్లో మహరాజ్ అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
- Advertisement -