Monday, December 23, 2024

ఇంట్లో నుంచి పారిపోయి అనాథగా మారిన బాలుడు కోటీశ్వరుడయ్యాడు..

- Advertisement -
- Advertisement -

ఇంట్లో నుంచి పారిపోయి వీధుల్లో భిక్షాటన చేస్తూ అనాథగా మారిన ఓ 10ఏళ్ల బాలుడు కోటీశ్వరుడయ్యాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పండోలి గ్రామంలో షాజేబ్ అనే బాలుడు తన తల్లి ఇమ్రానాతో కలిసి ఉండేవాడు. 2019లో భర్త చనిపోయిన తర్వాత అత్తమామలు వేధింపులకు గురిచేయడంతో ఇమ్రానా తన కుమారుడిని తీసుకుని కలియార్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే, కరోనా సమయంలో తన తల్లి ఇమ్రాన చనిపోవడంతో షాజేబ్ ఒంటిరివాడయ్యాడు. ఏం చేయాలో తెలియని షాజేబ్ కలియార్ లోని వీధుల్లో భిక్షాటన చేస్తూ అనాథగా బ్రతుకుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఆ బాలుడి తాత మహ్మద్ యాకూబ్ కూడా చనిపోయాడు. అయితే, చనిపోయేముందు మహ్మద్ యాకూబ్.. కోట్లు విలువ చేసే ఇల్లు, భూమి తన మనవడు షాజేబ్ పేరు మీద వీలునామా రాశాడు. దీంతో బంధువులు షాజేబ్ కోసం వెతకడం మొదలుపెట్టగా.. కలియార్ వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించాడు. అనంతరం బాలుడిని ఇంటికి తీసుకెళ్లి కోట్ల ఆస్థులకు వారసుడిని చేయడంతో.. ఇన్నీ రోజులు అనాథగా బ్రతికిన షాజేబ్ కోటీశ్వరుడయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News