Sunday, December 22, 2024

మొయిత్రా విచారణకు సహకరించలేదు: సోంకార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహువా మొయిత్రా విచారణకు సహకరించలేదని ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకార్ చెప్పారు.అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆమె మధ్యలోనేవాకౌట్ చేశారని తెలిపారు. విపక్ష ఎంపీలు కూడా కోపంతో ఆరోపణలు చేసి సడన్‌గా మీటింగ్‌నుంచి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. మహువా మొయిత్రా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ప్రొసీడింగ్స్ పట్ల తప్పుడు అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించారని ఇంతకు ముందు ఆమెపై ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబే అన్నారు. మొయిత్రాకు వ్యతిరేకంగా తాను, ఇతరులు సాక్షాలు సమర్పించిన తర్వాత ఆమెను ఏ శక్తీ కాపాడలేదని బిజెపి ఎంపి అన్నారు.

అంతకు ముందు ఎథిక్స్ కమిటీ ఎదుట విచారణకు హాజరైన మొయిత్రా బీటలు వారిన బంధమే తనపై ఫిర్యాదుకు కారణమైందని చెప్పినట్లు సమాచారం. న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మహువాకు సన్నిహితుడు. కొన్నాళ్లు వారిద్దరూ సహజీవనం కూడా చేశారు.వారు విడిపోయిన తర్వాత పెంపుడు కుక్క, మరికొన్ని వస్తువుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తనమీద కక్షతోనే దేహద్రాయ్ ఇదంతా చేయిస్తున్నట్లు మొయిత్రా ఆరోపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News